వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఈసారి ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో సీ 12 కోచ్ ఎమర్జెన్సీ విండో ధ్వంసం అయ్యింది. రైలు విశాఖ చేరుకున్న తర్వాత సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టి విండోను మార్చారు. ఈ కారణంగా ఫిబ్రవరి 4న రైలు 3 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. పూర్తి వివరాలు..
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన రైలుపైకి తాజాగా ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరికొట్టారు. ఈ దాడిలో సీ-12 కోచ్ (చైర్ కార్ కోచ్) విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసం అయింది. శుక్రవారం (ఫిబ్రవరి 3) సాయంత్రం ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
Prev Post