Logo

శృతిమించిన భారాస ఆగడాలు- ఈటెల

హుజురాబాద్ లో ఉన్న ప్రశాంత వాతావరణంను అధికారపక్షం నేతలు చెడగొడుతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజల మీద దాడులు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను అకారణంగా కొడుతున్నారు. నిన్న మా మీదనే దాడి చేస్తే.. దాడి చేసిన వారిని వదిలిపెట్టి.. మళ్లీ మా నేతలు, కార్యకర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొని వెళ్లి విపరీతంగా కొడుతున్నారని అయన అన్నారు.
ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు. అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి. పోలీసులు అధికారపక్షం తొత్తులుగా మారారా? టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోవలసిన అవసరం ఏంది ? కొట్టడం ఏంటి? డీజీపీ చట్టం పనిచేస్తుందా ? లేదా ? మాట్ల రమేష్, మాట్ల కళ్యాణ్, పంగిడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, పిల్లి సతీష్,తుమ్మ శోభన్ లని వెంటనే విడుదల చేయాలని అయన డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking