Logo

మత్స్యరంగం అభివృద్ధికి 323 కోట్లు

తెలంగాణలో మత్స్యరంగం అభివృద్ధికి 323 కోట్లు

హైదరాబాద్ : తెలంగాణలోని మత్స్యకార్మికుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 323 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్. రాష్ట్రంలోని మత్స్యకార్మికుల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి, ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసారు ఆయన.

రాష్ట్రంలోని 5028 సంఘాలు మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలలో సుమారు 4 లక్షల మత్స్యకార్మికులకు ఉపాధి కలిగే విధంగా ఈ నిధులను వినియోగించనున్నారు. నిధులు కేటాయించేందుకు కృషిచేసిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసన మండలి సభ్యులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారికి,  ప్రత్యేకంగా కృతజ్ఞతలు వారి వెంట ఉండి సహకరించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర సలహాదారులు పిట్టల రవీందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్.

Leave A Reply

Your email address will not be published.

Breaking