Logo

బడ్జెట్ లో బీసీల సంక్షేమం కొరకు అధిక బడ్జెట్

బడ్జెట్ లో బీసీల సంక్షేమం కొరకు అధిక బడ్జెట్
: మంత్రి తలసాని

హైదరాబాద్ జనవరి 30 : ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అదేవిధంగా త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో బీసీల సంక్షేమం కొరకు అధిక బడ్జెట్ కేటాయించే విధంగా ముఖ్యమంత్రిని ఒప్పిస్తానన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలసంక్షేమం కొరకు, బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం క్యాలెండర్ ను రూపొందించినందుకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవును మంత్రిగారు అభినందించారు. అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ మాట్లాడుతూ 2018 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్నటువంటి బీసీ కార్పొరేషన్ రుణాలను తక్షణమే విడుదల చేయించాలని మంత్రి గారిని కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దామరచర్ల గ్రామ ఉపసర్పంచ్ కానసాని రాములమ్మ సోమయ్య, అప్పనబోయిన సైదరాజు, లావూరి రంగా, రామకృష్ణ,వెంకటేశ్వర్లు, సైదా రాజు, శ్రీనివాస్, షంబయ్య, కోటి, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking