Logo

ఈస్ట్ మారేడ్‌ప‌ల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం

హైద‌రాబాద్ : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌ప‌ల్లిలోని శ్రీ లా హాట్స్ అపార్ట్‌మెంట్‌లో శుక్ర‌వారం రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది.

బీ బ్లాక్‌లోని ఏడో అంత‌స్తులోని ఓ ఇంట్లోని పూజ గ‌దిలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. పూజ గ‌దిలో వెలిగించిన దీపం ద్వారా మంట‌లు అంటుకున్నాయి.

మంట‌లు ఎగిసిప‌డటాన్ని గ‌మ‌నించిన అపార్ట్‌మెంట్ సిబ్బంది, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది.

ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి ఎలాంటి అపాయం జ‌ర‌గ‌లేద‌ని పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking