రౌడీషిటర్.. వీడు ఏది కావాలంటే అది స్వేచ్ఛగా చేస్తాడు. అడ్డు చెబితే దాడులు చేస్తాడు. పోలీసులంటే పెద్దగా పట్టించుకోడు. అమ్మాయిలతో అర్ధనగ్న నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు.. పండుగలు, శుభకార్యాల సమయాల్లో చేయించడం తెలిసిన విషయమే. అయితే వీడు డిఫరెంట్ … ఈ రౌడిషీటర్ చేష్టలు హద్దు మీరి పోయాయి. యువకుడితో అర్థనగ్న నృత్యాలు.. ఒళ్లంతా తడుముతూ, చెంపలు తాకుతూ ఓ రౌడీషీటర్ పైశాచికానందం పొందుతాడు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం పాతబస్తీలో ఓ రౌడీ షీటర్ యువకులతో అర్థనగ్న నృత్యం చేయించాడు. వారిని కత్తితో బెదిరించి బట్టలు చింపేసి.. కేవలం డ్రాయర్ల మీద నృత్యం చేయిస్తూ.. వారి శరీర భాగాలను తడుముతో పైశాచిక ఆనందం పొందాడు.
ఆ యువకుల చెంపలపై ముద్దులు పెడుతూ అసహజ కార్యానికి తెరలేపాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మూడు నెలల క్రితం మర్ఫా అనే అరబిక్ బ్యాండ్ మ్యూజిక్ మధ్య ఈ పని జరిగినట్లు సమాచారం. ఈ వీడియోలు సోమవారం వెలుగులోకి వచ్చాయి.
ఇవి వైరల్ కావడంతో చాంద్రాయణ గుట్ట పోలీసులు స్పందించారు. వీడియోను పరిశీలించి అందులో ఉన్న బాధితుడు నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.యువకుడిని కత్తితో బెదిరించి.. బట్టలూడదీసి డ్రాయర్ పై నగ్నంగా నృత్యం చేయించిన సదరు వ్యక్తిని గుర్తించారు. అతను బార్కాస్ సలాలాలో ఉండే వ్యక్తి అని తెలిసింది.
ఆ వ్యక్తి పేరు అలీబా ఈసా (45). అతని మీద చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదయింది. అయితే ఈ ఘటన నేపథ్యం మూడు రోజుల క్రితం జరిగిన గొడవ చర్చనీయాంశంగా మారింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో అలీ దాడులే కాదు.. అర్థనగ్న నృత్యాలతో కూడా హింసిస్తాడని తెలుస్తోంది. మద్యం మత్తులో అతను తరచుగా ముజ్రాలు చేయిస్తుంటాడని తేలింది. ఆ సమయంలో కత్తితో బెదిరిస్తూ యువకులను అసభ్యంగా తాకుతూ.. అసహజంగా ప్రవర్తిస్తాడని.. వైరల్ అయిన వీడియోలోని బాధితుడు షేక్ సాలం బావజీర్ తెలిపాడు.
అయితే ఈ వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో హత్యాయత్నం కేసులో నిందితుడుగా ఉన్న అలీబా ఈసా… పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది.