అగ్ని ప్రమాదం..
భారతదేశంలో ఎక్కడో ఒకచోట
అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం..
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. వుడ్ వర్క్ జరుగుతున్న క్రమంలో మంటలు చెలరేగినట్లు పోలీసుల సమాచారం. మంటల వ్యాప్తితో గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న నూతన సచివాలయం
Telangana New Secretariat: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనం ముస్తాబవుతోంది. ప్రారంభోత్సవానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైనా నేపథ్యంలో అగ్ని ప్రమాదం ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేశారెమోనని అనుకుంటున్నారు.