తెలంగాణలో ధర్మ రక్షణకు అన్ని రకాల సహాయ సహకారాలు
: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ : ఆర్మూర్‌కు ప్రత్యేక చరిత్ర ఉందని.. నవనాధులనే సాధువుల పేరుపై ఏర్పడ్డ పవిత్ర ప్రాంతమిది అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం నందిపేట్ పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కవిత మాట్లాడుతూ.. కేదారేశ్వర ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక సదస్సు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాపాడుకున్నాం కాబట్టే దేశం గొప్ప స్థాయిలో ఉందని చెప్పారు.
తెలంగాణలో ధర్మ రక్షణకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. దేశంలో అందరూ సోదర భావంతో మెలుగుతూ దేశం విశ్వ గురువుగా ఎదుగాలని కోరుకున్నారు.
భారత జాతిని ముందుకు నడపాలని సాధుసంతులను వేడుకుంటున్నానని ఎమ్మెల్యే కవిత తెలిపారు.