అనకాపల్లి డీఎస్పీ సునీల్ పై బదిలీ వేటు
అమరావతి : ఏపీలోని అనకాపల్లి డీఎస్పీ బి. సునీల్ కుమార్ తీరు వివాదస్పదమైంది. గంజాయి కేసులో పట్టుబడిన ఓ నిందితుడికి చెందిన వాహనాన్ని (కారు) సొంతానికి వాడుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
దీంతో ప్రభుత్వం అతనిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కారు నెంబర్ ప్లేట్ మార్చి కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు విశాఖ బీచ్‌కు వెళ్లటం విమర్శలకు దారి తీస్తుంది. విశాఖ బీచ్‌లో మరో వాహనాన్ని డీఎస్పీ తీసుకెళ్లిన కారు ఢీ కొట్టడంటో ఈ వ్యవహారం బయటపడింది. సీజ్ చేసిన వాహనాన్ని సొంతానికి వాడుకోవటమే కాకుండా.. దానికున్న నెంబర్ ప్లేట్ మార్చటంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.