Logo

దమ్ముంటే దాడి చేయండి : వైఎస్ ఆర్ బిడ్డ సవాల్

 మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

దమ్ముంటే దాడి చేయండి : వైఎస్ ఆర్ బిడ్డ సవాల్

మహబూబాబాద్ : మహబూబ్ బాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మాట – ముచ్చట నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. షర్మిల మాట్లాడుతూ పాదయాత్రను అడ్డుకొనెలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నారు. ఎలా పాదయాత్ర చేస్తారో చూస్తా అనే బెదిరించే ధొరణిలో మాట్లాడుతున్నారు.

ఒక్క సైగ చేస్తే కార్యకర్తలు మాపై దాడి చేస్తారట. శంకర్ నాయక్ కి వైఎస్సార్ బిడ్డ సవాల్. మీకు దమ్ముంటే దాడి చేయండి చూద్దాం. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు వైఎస్సార్ బిడ్డ. ప్రజల పక్షాన నిలబడి,కొట్లడుతున్నందుకు భయపడాలా..? మీరు చేసిన మోసాలు ఎత్తి చూపిస్తున్ననందుకు భయపడాలా..? మీ నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలని అన్నారు.శంకర్ నాయక్ సైగ చెయ్యి…చూద్దాం.. ఎవడోస్తాడో రండి. సైగ చెయ్యి ఎవడు దాడి చేస్తాడో చూస్తా. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ రక్తం. శంకర్ నాయక్ ఒక కబ్జా కోర్. జనాల దగ్గర భూములు గుంజుకోడమే తెలుసు. వైఎస్సార్ దిమ్మె 8 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే కూల్చేశారంట. పక్క నియోజక వర్గంలో ఎర్రబెల్లి దయాకర్ అనే వాడు ఉన్నాడు. ఆయన అక్రమాలు,భూ ఆక్రమణలు గురించి మాట్లాడినా. ఆడదానివి అయి ఉండి ఎలా మాట్లాడుతున్నవు అంటున్నాడని అన్నారు.

ఆడదాన్ని అయితే మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. ఆడదానికి గొంతు లేదా..? నిన్ను కన్నది ఆడది కాదా..? నీ భార్య ఆడది కాదా..? ఆడది మనిషి కాదా..? ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎర్రబెల్లి. అవుతాపూర్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశారు. వైఎస్సార్ విగ్రహం ప్రారంభంలో వచ్చిన మహిళలను లిస్ట్ తీయమని అన్నాడట. వాళ్లకు పెన్షన్ లు అపుతడట… ప్రభుత్వ పథకాలు ఆపుతదట. ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నావు ఎర్రబెల్లి. నీ అబ్బ సొమ్మా..? మీ పెత్తనం ఎంటి..? నీ జాగీరా..? నీ ఇలాకా నా..? ప్రజలు బాంచన్ అనాలా…మీ కాళ్ళ దగ్గర సేవ చేయాలా..? ఎర్రబెల్లి మీద మేము ఆరోపణలు చేసిన మాట వాస్తవం. దమ్ముంటే పబ్లిక్ ఫోరం పెట్టండి. జర్నలిస్ట్ లను పిలుద్దాం. ప్రతిపక్షాలను పిలుద్దాం…ప్రజలను పిలుద్దాం. మీరు సుద్ధపూస అయితే నిరూపించుకొండని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking