Logo

అరుణ్ సాగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవార్డులు

 కె.రామచంద్రమూర్తికి అరుణ్ సాగర్ పాత్రికేయ పురస్కారం

 కుప్పిలి పద్మకు అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం

 ఫిబ్రవరి 12న భద్రాచలంలో అవార్డుల ప్రదానం

అరుణ్ సాగర్ ట్రస్ట్ నిర్ణయం

ప్రముఖ కవి, విలక్షణ జర్నలిస్టు అరుణ్ సాగర్ పేరిట ఇచ్చే పురస్కారాలను ఈ సంవత్సరం ప్రముఖ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి, ప్రముఖ కవయిత్రి కుప్పిలి పద్మకు అందించనున్నట్టు అరుణ్ సాగర్ ట్రస్ట్ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

ఫిబ్రవరి 12వ తేదీన ఉదయం 10.30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో అవార్డుల ప్రదానం ఉంటుందని తెలిపింది.

తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన స‌భ జ‌ర‌గ‌నున్న‌ట్టు పేర్కొంది.

సభలో విశిష్ట అతిథులుగా సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గౌరవ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టి.ఎస్.పి.ఎస్.సి. మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి, సాక్షి సంపాదకులు కె.శ్రీనివాస్, వర్ధెల్లి మురళి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నది.

Leave A Reply

Your email address will not be published.

Breaking