Logo

హైదరాబాద్ లో 24న బయో ఆసియా సదస్సు 

ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు

బయో ఆసియా సదస్సు 

హైదరాబాద్ : 2028 నాటికి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం విలువను రెట్టింపు చేస్తామన్న లక్ష్యాన్ని మరోసారి ప్రకటించిన మంత్రి కేటీఆర్. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల విలువ కలిగిన లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టంను రెట్టింపు చేస్తామన్నారు ఆయన. 4 లక్షల ప్రస్తుత ఉద్యోగాల సంఖ్యను రెట్టింపు చేసి 8 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. బయో ఆసియా సదస్సు నేపథ్యంలో విలేకరులతో మంత్రి కేటీఆర్‌ చిట్ చాట్ చేశారు.

బయో ఆసియా ప్రాముఖ్యతతోపాటు జీవశాస్త్ర, ఫార్మా రంగాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యల గురించి వివరణ ఇచ్చారు మంత్రికేటీఆర్. 19 సదస్సులను పూర్తిచేసుకుని ఈసారి ప్రతిష్టాత్మకమైన 20వ సదస్సును నిర్వహించుకోబోతున్నామన్నారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు ఈ సదస్సు ఉంటుంది

‘‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌: షషేపిగ్ నెక్ట్స్ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’’ అన్న ఇతివృత్తంతో జరగనున్న 20వ బయో ఆసియా సదస్సు. బయో ఆసియా గత పంతొమ్మిది ఏళ్లలో మూడు బిలియన్ డాలర్లు సుమారు 24 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడుల్లో కొన్ని ఆంధ్రప్రదేశ్‌కూ వెళ్లయన్నారు కేటీఆర్.

భారతదేశ లైఫ్ సైన్సెస్ రంగానికి బయో ఏసియా విస్తృతమైన సేవలను అందించిందన్నారు ఆయన. దేశ లైఫ్ సైన్సెస్ రంగంలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ సదస్సు విజయం సాధించి తీరుతుందన్నారు. వందకుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్‌ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగామని, 20 వేలకుపైగా భాగస్వామ్య చర్చలు 30 పాలసీ పేపర్లు, సిఫార్సులను ఈ సదస్సు అందించిందన్నారు.

100 దేశాలు ఇప్పటిదాకా ఈ సదస్సులో పాల్గొన్నాయి. గత 20 సంవత్సరాలలో 250 కి పైగా అవగాహన ఒప్పందాలను ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవడంలో ఈ సదస్సు భాగస్వామిగా ఉంది. ఇప్పటికే అనేక దేశాలు భాగస్వామ్య కంట్రీల హోదాలో ఏషియాలో పాల్గొన్నాయి. ఈసారి కూడా పలు దేశాలు బయోఏషియాతో భాగస్వామ్య దేశం హోదాలో పాల్గొంటున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా బయో ఆసియా సదస్సు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ఉందన్నారు మంత్రి కేటీఆర్.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking