Logo

తర్నం వంతెనను పరిశీలించిన బీజేపీ నేతలు

తర్నం వంతెనను పరిశీలించిన బీజేపీ నేతలు

అదిలాబాద్ ఫిబ్రవరి 23 : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తర్నం వంతెనను బీజేపీ నాయకులు మరోమారు పరిశీలించారు. నిన్నటివరకు దెబ్బతిన్న ఈ వంతెనపై టూవీలర్లు పాదచారులు రాకపోకలు సాగించేవారు. గోడ నిర్మాణంతో వంతెనపైనుండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిపై ఇరువైపులా గోడలు నిర్మించడం, ప్రత్యామ్నయ దారి ఇరుకుగా ఉండటం, దూరభారం కావడంతో వాగు దాటి ప్రయాణిస్తున్నారు ద్విచక్ర వాహనదారులు , పాదచారులు అప్పటి వరదల ధాటికి కుంగి పోయిన బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మిచి ఉంటే ఈ అవస్థలు ఉండేవి కావని ఇది ముమ్మాటికి ఎమ్మెల్యే జోగు రామన్న తప్పిదమే అని బీజేపి నాయకుడు కంది శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ముందుచూపుతో స్పందించి వంతెన నిర్మించి ఉంటే ప్రజలకు బాధలు తప్పేవని అన్నారు. పైగా ఇప్పుడు అంచనా వ్యయం పెరిగిందన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking