బ్రతుకు తెరువు కోసం వాళ్లంతా దుబాయ్ వెళ్లారు. అయనా.. వాళ్లకు దేశభక్తి ఎక్కువే. స్వాతంత్య్ర దినోత్సవం.. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి తన దేశభక్తిని నిరూపించుకుంటారు వాళ్లంతా.. ఔను వాల్లు ఏ దేశంలోొ ఉన్న దేశభక్తితో పాటు జాతీయ జెండాలను మరువరు.
ఇగో.. 26 జనవరి రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా దుబాయిలో రక్తదానం చేశారు తెలంగాణ ప్రజలు.
భారతదేశం జరుపుకోనున్న 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దుబాయిలోని తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో దుబాయి ఎల్లాల శ్రీనన్న సేవాసమితి అధ్యక్షులు రవి ఉట్నూరి, ఉపాధ్యక్షులు బాలు బొమ్మిడి, రవి డేవిడ్, ఆరెల్లి రమేష్, వేణుగోపాల్ బోగ తో పాటు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.