పాకిస్థాన్ ఆర్థిక సంక్షోెభంతో అతలకుతలం అవుతుంది. నిత్యవసర ధరలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఏకంగా రూ.35 పెంచింది పాకిస్థాన్
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ డబ్బుల్లేక విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ఖజానాను నింపుకునేందుకు ప్రజలపై తీవ్ర భారాన్ని మోపింది.
పెట్రోలు, డీజిల్ ధరను లీటరుకు రూ. 35 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పరిమితులను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసిన తర్వాత పాక్ కరెన్సీ దాని విలువలో దాదాపు 12 శాతం కోల్పోయింది. రూపాయి విలువ దారుణంగా క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆయిల్ అండ్ గ్యాస్ అధికారుల సిఫార్సుల మేరకే పెట్రోలు, డీజిల్ ధరలను పెంచినట్టు పాక్ ఆర్థికమంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ధరలు పెరిగే అవకాశం ఉండడంతో కృత్రిమ కొరత, ఇంధనం నిల్వ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న అధికారుల సూచనతోనే ధరలను తక్షణం పెంచినట్టు తెలిపారు.