Logo

బీఆర్ఎస్ అరాచకాలపై ఛార్జ్ షీట్ రిలీజ్

దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచకాలపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేయబోతున్నమన్నారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హాత్ సే హాత్ జోడో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నమన్నారు ఆయన.

మొన్న కేంద్రంలో బీజేపీపై ఛార్జ్ షీట్ తెలుగులో కూడా అనువాదం చేస్తున్నమన్నారు రెడ్డి. బందిపోటుల రాక్షస సమితి మీద త్వరలో ఛార్జ్ షీట్ వేస్తామన్నారు.ఒక్కటి కూడా ఎన్నికల హామీని నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్, కేజీ టు పీజీ విద్య ఇలా అన్ని మాటలు కేసీఆర్ తప్పాడన్నారు.

నిధులు, నీళ్లు, నియామకాల ఊసును బీఆర్ఎస్ ప్రభుత్వం మరచిపోయారని, రైతులకు ఉచిత ఎరువులు, గొల్ల కూర్మలకు గొర్రెలు ఏమయ్యయని ప్రశ్నించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking