Logo

ఎమ్మెల్సీ కవితను కలిసిన సినీహీరో శరత్ కుమార్

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌ భేటీ అయ్యారు.

హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై కవితతో ఆయన చర్చించినట్లు సమాచారం.

భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) స్థాపన ఉద్దేశం, లక్ష్యాలు, అజెండా తదితర అంశాలను శరత్‌కుమార్‌ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆయన పార్టీలో చేరే విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking