Logo

కాంస్య పతాక విజేత మనోజ్‌కు అభినందనలు

తెలంగాణ క్రీడా ప్రోత్సాహక విధానాలతోనే క్రీడాకారుల రాణింపు
షూటింగ్స్‌ బాల్‌ కాంస్య పతాక విజేత మనోజ్‌కు అభినందనలు
– శాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుండి అనుసరిస్తున్న క్రీడా ప్రోత్సాహక విధానాలలో మన రాష్ట్ర క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని శాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు.యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం, గంగాపురం గ్రామానికి చెందిన మనోజ్‌ ఇటీవల ఉత్తరప్రదేశ్‌ ఘాజిమబాద్‌లో జరిగిన మొదటి అసియన్‌ షూటింగ్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన టీమ్‌ సభ్యుడు మనోజ్‌ను ఈరోజు ఛైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ గారిని మర్యాదపూర్వకంగా ఆయన ఛాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా శాట్స్‌ ఛైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌ గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహక విధానాల వల్ల క్రీడాకారుల్లో నూతన ఉత్సాహం కలుగజేస్తుందని, వివిధ క్రీడాంశాల్లో తెలంగాణ బిడ్డలు సాధిస్తోన్న అద్భుతమైన ఫలితాలు ప్రశంసనీయమని అన్నారు.మనోజ్‌ (షూటింగ్‌ బాల్‌) మరిన్ని విజయాలు సాధించాలని ఆయన అభిలాషించారు. తెలంగాణ రాష్ట్రానికి కీర్తి తెచ్చిపెట్టే క్రీడాకారులకు, కోచ్‌లకు ‘శాట్స్‌’ ప్రోత్సాహం ఎళ్లవేళలా ఉంటుందని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking