Logo

గడప గడప కు కాంగ్రెస్ యాత్ర

31వ రోజుకు చేరిన గడప గడప కు కాంగ్రెస్ యాత్ర

మందమర్రి : హాత్ సె హాత్ జోడో కార్యక్రమం లో భాగంగా ఈ రోజు మందమర్రి మండలలోని సoడ్రోన్ పల్లి గ్రామం లో పిసిసిమెంబర్ నూకల రమేష్ అద్వర్యం లో గడప గడప కు వెళ్లడం జరిగింది. ఈ సందర్బంగా నూకల రమేష్ ఇంటి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పథకాల గురించి గుర్తు చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి గడప గడప కు చెప్పడం జరుగుతుందని అన్నారు, సoడ్రోన్ పల్లి గ్రామం లో ఉపాధి హామీ కూలీలకు ఏడాది నుండి కూలీ డబ్బులు కూడా చెల్లిచలేదని గ్రామస్తులు వాపోతున్నారని వెంటనే ఉపాధి కూలీలకు ఏడాది నుండి రావాల్సిన కూలీ డబ్బులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

అర్హులకు కూడా పెన్షన్ రావట్లేదని, ఎప్పుడో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉన్న ఇందిరమ్మ ఇల్లు తప్ప కెసిఆర్ ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇయ్యలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అంతేకాక గ్రామం లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, కెసిఆర్ ఇస్తా అన్న నిరుద్యోగ భృతి వెంటనే ఇయ్యాలని అన్నారు. పండిన పంటలకు గిట్టుబాట ధర రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రైతులకు, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమం లో.. సోషల్ మీడియా రాష్ట్ర సెక్రటరి ఎండి ముజాహిద్, డిసిసి డెలిగేట్ పుల్లూరి లక్ష్మణ్, ఎండి జమీల్, ఎండి షుకూర్, జమాల్ పూరి నర్సోజి, వడ్లూరి సునీల్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజిని, దాసరి స్రవంతి, నూగురి రాధా స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking