అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా
అమెరికా యూనివర్సిటీతో ఒప్పందం
మేడ్చల్, మే 22 : మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలోని ఎస్పార్ విశ్వవిద్యాలయం అమెరికాలోని మిస్సోరీ విశ్వవిద్యాలయాల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. పరస్పర ఒప్పందాలపై విశ్వవిద్యాలయ ప్రతినిధులు సంతకాలు చేసుకుని ఒకరికొకరు మార్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సార్ విశ్వవిద్యాలయం, అమెరికాలోని మిస్సోరి విశ్వ విద్యాలయాల ప్రతినిధులు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నూతన విద్యా అభివృద్ధి కోసం అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయంతో హనుమకొండ జిల్లాలోని ఎస్సార్ విశ్వవిద్యాలయం మధ్య శనివారం పరస్పర ఒప్పందం కుదిరిందని తెలిపారు.
శాస్త్ర సాంకేతిక విద్యతో పాటు, నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు అధునాతన విద్యా అవకాశాలను పెంపొందించుకునేందుకు, అంతర్జాతీయ ఇంజనీరింగ్ ప్రోగ్రాం సంబంధిత పలు అంశాలపై అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయమైన యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి, ఎస్పార్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నామని తెలిపారు.
హైదరాబాదులోని ఎస్సార్ విఐటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరు విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను అందిపుచ్చుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి ప్రెసిడెంట్ డాక్టర్ రోజర్ టెస్ట్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా ఎస్ఆర్విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాలు యూఎస్ఏ లోని సెంట్రల్ మిస్సోరీలో ఒక సంవత్సరం చదవడం ద్వారా బీఎస్ డిగ్రీ పొందే విధంగా మరియు మరో సంవత్సరం చదవడం ద్వారా ఎంఎస్ డిగ్రీ పొందే విధంగా ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.
అనంతరం ఎస్సార్ విశ్వవిద్యాలయ ప్రో ధాన్నర్ ఏ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు శాస్త్ర సాంకేతికత నవీన ఆవిష్కరణలు చేపట్టేందుకు అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడంలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఈ ఒప్పందం ద్వారా తక్కువ ఖర్చుతోనే అంతర్జాతీయ డిగ్రీ పొందే అవకాశం మన విద్యార్థులకు లభించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ సింట్రల్ మిస్సోరి ప్రతినిధులు డాక్టర్ సిల్ బ్రిడ్గం, ప్రొవెస్ట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ అకాడమిక్ అఫైర్స్ డాక్టర్ జెప్పా రోబోటిస్తన్, బీన్ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డాక్టర్ ఫిల్ హుల్, డైరెక్టర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీసెస్, డాక్టర్ మహమ్మద్ యూసఫ్ గ్రాడ్యుయేట్ కోఆర్డినేటర్ కంప్యూటర్ సైన్స్ అండ్ సైటర్ సెక్యూరిటీ, ఎస్సార్ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ వి.మహేష్, డీసీ స్టూడెంట్స్ వెల్ఫేర్, డాక్టర్ అర్బన రెడ్డి డీన్ అకాడమిక్స్ తదితరులు పాల్గొన్నారు.