Logo

శ్రీకాళహస్తీలో అసాధారణ స్థాయిలో భద్రత

శ్రీకాళహస్తీలో అసాధారణ స్థాయిలో భద్రత
1200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు
జిల్లా ఎస్పి పి. పరమేశ్వర రెడ్డి

శ్రీకాళహస్తీ : మహశివరాత్రి నేపధ్యంలో శ్రీకాళహస్తీలో అసాధారణ స్థాయిలో భద్రతఏర్పాటు చేసామని ఎస్యపి పరమేశ్వర రెడ్డి వెల్లడించారు. 1200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసాం. అలాగే, జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 ప్రముఖ శైవ క్షేత్రాలలో కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి అన్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సుమారు రెండు లక్షల నుండి 3 లక్షల వరకు భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున పోలీస్ శాఖ కూడా అంచనాలకు తగ్గట్టు సుమారు 1200 మంది పోలీస్ సిబ్బందితో భద్రతాపరమైన చర్యలను చేపట్టి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసు అధికారుల సారథ్యంలో ఏర్పాట్లు చేశామన్నారు.

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, అదే సమయంలో విఐపిలకు కూడా తగిన సమయం కేటాయించడం జరిగింది. ఆ సమయంలోనే వారు దర్శనానికి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము, అలాగే ఊరేగింపు సమయంలో మాడవీధులలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

వాహనాల పార్కింగ్, దారి మళ్లింపు ఉన్న ప్రతి చోటా సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ఎంట్రీ & ఎగ్జిట్ గేటుల వద్ద భక్తులకు సమాచారం పూర్తిగా తెలిసేలా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి, రెవెన్యూ యంత్రాంగం, దేవాదాయ శాఖ ప్రోటోకాల్ సిబ్బంది, మున్సిపల్ తదితర సంబంధిత శాఖల వారితో సమన్వయం చేసుకుంటూ పోలీసు శాఖ విధులు నిర్వర్తిస్తుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking