Logo

రైతు ఆత్మ హత్యల పై అబద్ధపు ప్రచారం

రైతు ఆత్మ హత్యల పై అబద్ధపు ప్రచారం

భారాస నాయకుల ఆగ్రహం

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పై కొందరు వ్యక్తులు, పత్రికలు,సంస్థలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని భారాస నాయకులు ప్రత్యారోపన చేశారు.

రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు , ఎం ఎస్ ప్రభాకర్,ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ సోమవారం బిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.లేని ఆత్మహత్యలు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని,
ఆత్మహత్యలకు వాళ్లే పురి కొల్పుతున్నారని పల్లా మండి పడ్డారు.

నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కలను కూడా వక్రీకరిస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో తెలంగాణలో ఆత్మ హత్యలు గణనీయంగా గా తగ్గాయని బదులిచ్చిందని రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.గువ్వల బాలరాజు మాట్లాడుతూ
మాజీ ఐ పీ ఎస్ అధికారి,రాష్ట్ర బీ ఎస్ పి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ పై, రాష్ట్ర ప్రభుత్వం పై నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు.
ప్రభుత్వం తనకు అప్పజెప్పిన బాధ్యతలను అధికారిగా ప్రవీణ్ దుర్వినియోగం చేశారని విమర్శించారు.

రాష్ట్రం లో గవర్నర్ ప్రతిపక్షాల లాగానే ఆధారం లేని విమర్శలు చేస్తున్నారని,గవర్నర్ పబ్లిసిటీ కోసం కార్యకలాపాలు చేస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు.
ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ మధ్యతరగతి ,బీసీ వర్గాలకు ఇప్పటివరకు చేసిందేమీ లేదని విమర్శించారు.ఓబీసీ లకు కేంద్రం లో మంత్రిత్వ శాఖ నే లేదని,
మోడీ ఏ మొహం పెట్టుకొని బీసీలకు మధ్యతరగతి వారికి బీజేపీ కార్యకర్తలు చేరువ కావాలని కోరతారన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking