Logo

బ్రిటన్ ప్రధాని వాహనంలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదని జరిమానా

ఊరు సర్పంచ్.. కళ్లు కనబడకుండా ఏదెదో చేస్తుంటారు. పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు.

ఎమ్మెల్యే అయితే… అతను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంకు రాజులా వ్యవహరిస్తాడు.

పోలీసు, రెవెన్యూ ఇతర అధికారులందరు గులాం గిరి చేయాల్సిందే.

ఆ ఎమ్మెల్యే దయతో ఉద్యోగం చేస్తున్నట్లు ఫీలాయ్యే అధికారులు ఎమ్మెల్యే చేసే తప్పులను పట్టించుకోరు.

సీటు బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 

కానీ.. బ్రిటన్ లో మాత్రం మనలా లేదు. తప్పు ఎవరు చేసిన తప్పు తప్పే అంటారు అక్కడి పోలీసులు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార వాహనంలో ప్రయాణం చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. అంతే.. ఆ ప్రధానికి సెక్యూర్టీగా ఉన్న పోలీసు అధికారులు స్వయంగా ఆ బ్రిటన్ ప్రధానికి  £100 జరిమాన విధించారు.

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిబంధనలకు విరుద్దంగా వాహనంలో ప్రయాణం చేసిన సందర్భంలో పోలీసులు ఫైన్ వేసిన వీడిియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పొలిటికల్ భారత దేశంలో ఇగో ఇలా ఉంటుంది మరి..

 

Leave A Reply

Your email address will not be published.

Breaking