Logo

జీహెచ్ఎంసీలో నిధులు లేక పనులు ఆలస్యం

జీహెచ్ఎంసీలో నిధులు లేక పనులు ఆలస్యం

: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ : పెనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీలో లో రోడ్లు, ఫ్లైఓవర్లు అభివృద్ధి అనుకోకుండా  హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్ పేట నల్లకుంటలోని పాత రామాలయం బస్తీలో జరుగుతున్న నాలా పనులను పరిశీలించారుఆయన.

నిధులు లేక హైదరాబాద్ బస్తీల్లోని పనులు కుంటుపడుతున్నాయన్నారు. నల్లకుంట, అంబర్ పేట, గౌలిపురా, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్ బస్తీలు నిజమైన హైదరాబాద్ అన్నారు కిషన్ రెడ్డి. నిజమైన హైదరాబాద్ లో అభివృద్ధి చేయాలన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నుంచి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోన్న బడ్జెట్ లో కేవలం 30 కోట్ల రూపాయలే కేటాయించారన్నారు. దీని వల్ల బస్తీల్లో మౌళిక వసతుల కల్పన కుంటుపడుతోంది.

ముసీలో కలిసే నాలా వర్షా కాలంలో ఓవర్ ఫ్లో అవ్వడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.. నాలా పొంగి బస్తీల్లోకి మురుగు నీరు వచ్చేస్తోంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు, స్లాబ్ వేయించానన్నారు కిషన్ రెడ్డి. బస్తీలో చిన్న లైన్స్ వల్ల భవిష్యత్తులో వర్షాలు ఎక్కువగా పడితే ఇళ్లల్లోకి నీరు చేరిపోయే అవకాశాలు ఎక్కువ  దీనికి ప్రత్యామ్నాయంగా మెయిన్ రోడ్డు వెంట డ్రెయినేజీ తీసుకువెళ్లి ముసీలో కలపాలని అనేక సార్లు కోరానన్నారు కిషన్ రెడ్డి.

జీహెచ్ఎంసీలో నిధులు లేకపోవడంతో .. పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. హైదరాబాద్ లో చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు.. దీని వల్ల పనులు కుంటుపడుతున్నాయి. హైదరాబాద్ లో 1200 కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణలోని వన్ థర్డ్ పాపులేషన్ హైదరాబాద్ లోనే ఉంది. నిధులు లేక మౌళిక వసతులు కల్పించకపోవడంతో బస్తీలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు మౌళిక వసతులు కల్పించే జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ నిధులు లేక కుదలయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking