Logo

మత్స్యకార్మికులకు బడ్జెట్ లో ఎక్కువ నిధులు కెటాయించాలి

సీఎం కేసీఆర్ ను కలిసిన ముదిరాజ్ మహాసభ నాయకులు

ముదిరాజ్ బంధువులకు మంచి రోజులు వచ్చాయి. మాజీ మంత్రి ఈటెల రాజేంధర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈటెల లేని లోటును తీర్చడానికి మరో ముదిరాజ్ కులస్థునికి కీలకమైన బాధ్యతలు ఇస్తారని చాలా కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే.. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి సభ్యులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ ఆద్వర్యంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ సలహాదారు పిట్టల రవీందర్ ముదిరాజ్  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసారు. బడ్జెట్ లో మత్స్యకారులకు అదిక బడ్జెట్ కేటాయించి వివిధ పథకాలు అందించాలని మత్స్యశాఖ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు సీఎంకు వినతి పత్రం అందించారు.  దీనికి సానుకులం గా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్  స్పందించి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

మత్య్స కార్మికుల అభివృద్ది కోసం.. : సీఎం కేసీఆర్

మత్య్స కార్మికులు ఆర్థికంగా ఎదుగడానికి అవసరమైన సహయ సహాకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని  ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. పొద్దంతా కష్ట పడే మత్య్సకార్మికులకు – ప్రభుత్వం వారదిగా పని చే్స్తుందన్నారు. మధ్య దళారీల వ్యవస్థ లేకుండా చాపలు విక్రయించడానికి మార్కెట్ వ్యవస్థను అద్యాయనం చేయాలని సీఎం సూచించారు. తెలంగాణ చాపలు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. అవసరమైతే చాపలు నిలువ ఉంచడానికి కోల్డ్ స్టోరేజ్ గోదాంలు  ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.

త్వరలో మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవి..?

మత్స్య కారుల అభివృద్ది ధ్యేయంగా పని చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ పిట్టల రవీంధర్ కు మంచి రోజులు వచ్చినట్లే. త్వరలో మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. స్టేట్ ఫిషరీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పిట్టల రవీందర్ ను నియమిస్తూ ఉత్తర్వ్యుూలు జారీ చేయాలని రాష్ట్ర మత్య్స కార్మిక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, రైతు సమన్వయ సమితిీ అధ్యక్షులు పళ్ల రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పలు కార్పొరేషన్ ల చైర్మన్ లు తదితరులు కూడా ఉన్నారు.

అయితే.. ఎన్నో ఏళ్లుగా మత్య్స కార్మికుల కోసం కృషి చేస్తున్న పిట్టల రవీంధర్ కు ఆ మత్స్యశాఖ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇటీవల పిట్టల రవీంధర్ కూడా ఈటెల రాజేంధర్ ముదిరాజ్ లకు చేసిన అన్యాయంపై మీడియాలో గళం ఎత్తారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking