Logo

పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

ఊపీరి పీల్చుకున్న ప్రయాణీకులు

మేడ్చల్ జిల్లా: ఘట్ కేసర్ మండలం అంకుషాపూర్ లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727)కు పెను ముప్పు తప్పింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని అవుషాపూర్ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. ఆరు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి.

దీంతో ట్రైన్ లోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని రైల్వేశాఖ అధికారులు తెలుపుతున్నారు.

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో కాజీపేట-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం. ప్రస్తుతం రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.

ఘట్ కేసర్ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి తన వాహనాల్లో ప్రయాణీకులను గమ్యస్థానలకు చేరవేస్తున్నారు …

Leave A Reply

Your email address will not be published.

Breaking