Logo

అగ్ని ప్రమాదాలపై హోం మంత్రి ఉన్నత స్థాయి సమావేశం

నిబందనలకు విరుద్దంగిా ఉండే భవనాలను గుర్తించండి

రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం నాడు అగ్నిమాపక శాఖ అధికారులతో తన కార్యాలయంలో సమా

వేశమయ్యారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఫైర్ సర్వీసెస్ డీజీ వై నాగిరెడ్డి, జిహెచ్ఎంసి వి అండ్ ఈ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మీప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ లు నారాయణరావు, ప్రసన్న కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాదులో ని వాణిజ్య ,నివాస నిర్మాణాలను ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని అధికారులు తెలియజేశారు. భవనాలను నిర్మించేటప్పుడు సెల్లార్లను నిర్మిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వాటిల్లో వ్యాపారం చేస్తున్నారని వారు తెలిపారు. ట్రాఫిక్ రద్దీగా ఉంటున్న సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో సెల్లార్లను నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా సొంత వ్యాపారాలను చేస్తుండడంతో అగ్గి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని వారు వివరించారు

ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్లార్లను, భవనాల వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ రకమైన నిర్మాణాలపై చేపట్టవలసిన చర్యల గురించి ఈనెల 25వ తేదీన సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామని ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో పాటు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు తాను కూడా హాజరుకానున్నానని హోం మంత్రి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking