Logo

ఇరాక్ పర్యటనలో హోం మంత్రి మహమూద్ అలీ

ఇరాక్ పర్యటనలో హోం మంత్రి మహమూద్ అలీ

ఇరాక్, మే 22 : రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి ఇరాక్ దేశంలోని కర్బాలాలో నవాసా రసూల్ హజ్రత్ ఇమామ్ హుస్సేన్ మరియు అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యుల సమాధుల వద్ద ఫాతిహా పఠించారు.

ఈ సందర్భంగా భారతదేశంలో వ్యాపించిన అశాంతి తొలగి ప్రజల మధ్య సౌభ్రాతృత్వం, ఐకమత్యం నెలకొనాలని, దేశాభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించుకునేలా అవకాశం ఇవ్వాలని ఆయన ప్రార్థించారు. ముఖ్యమంత్రి క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు కుటుంబ స‌భ్యులు దీర్ఘ‌ాయుష్షు పొందాల‌ని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాల‌ని, ప్ర‌జ‌ల సౌభాగ్యం క‌ల‌గాల‌ని ప్రార్థ‌న‌లు చేశారు.

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరించుకునేలా, రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించేలా తమకు అవకాశం ఇవ్వాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులను కలిశారు.ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking