Logo

జర్నలిస్ట్ నుంచి ఎస్వీబీసీ – టీటీడీ సలహదారుగా

ఎస్వీబీసీ – టీటీడీ సలహదారుగా

బాధ్యతలు స్వీకరించిన సీనియర్ జర్నలిస్ట్ దుర్గ

అతను చేతిలో కలం పట్టుకుని అవినీతిపై గురి పెట్టాడు. సమాజంలో జరిగే అవినీతి అక్రమాలపై వార్త కథనాలు ఇచ్చాడు. అతనే సీనియర్ జర్నలిస్ట్ దుర్గ.. అతని ప్రతిభను గుర్తించి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్ధానం ( టీటీడీ ) ఎస్వీబీసీ సలహదారుగా నియమితులయ్యారు.

తిరుమల తిరుపతి దేవస్ధానం ( టీటీడీ ) ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ సలహదారుగా తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.

గత 26 సంవత్సరాల నుండి జర్నలిస్ట్ గా పనిచేస్తున్న తనకు తిరుమల శ్రీవారి సేవలో ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు చేసి అడ్వైంజర్ గా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి , టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారికి , టీటీడీ ఇవో ధర్మారెడ్డి గారికి కృతజ్ఞతలు జర్నలిస్ట్ దుర్గ.

ఎస్వీబీసీ ద్వారా మెరుగైన సేవలు అందించి భక్తులు మరింత చేరువయ్యే కార్యక్రమాల రూపకల్పనలో నా వంతు కృషి చేస్తానన్నారు ఆయన . ఇప్పటి వరకు తాను పనిచేసిన సంస్థల యాజమాన్యాలకు, సహచర పాత్రికేయ సోదరులకు , ఆత్మీయులందరికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన.  నా జీవితంలో మరో నూతన అధ్యాయానికి శ్రీ వేంకటేశ్వర స్వామి కరుణతో శ్రీకారం చుడుతున్నాను. ఎప్పటిలాగే మీ అందరి సహకారం కోరుకుంటున్నానన్నారు జర్నలిస్ట్ దుర్గ.

Leave A Reply

Your email address will not be published.

Breaking