Logo

పుణ్య జలాలతో కలశ యాత్ర

నేటి నుండి లక్ష చండీ మహా యజ్ఞం
– మహా క్రతువు నిర్వహణ కోసం పూర్తయిన ఏర్పాట్లు
– నేడు కురుక్షేత్ర చేరుకోనున్న స్వరూపానందేంద్ర
– పుణ్య జలాలతో కలశ యాత్ర

చంఢీఘడ్ : యావత్ భారతావనిలోనే తొలిసారిగా చేపడుతున్న శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కురుక్షేత్ర సమీప గుంతి ప్రాంతంలో 55 ఎకరాల సువిశాల ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేసారు. గుంతి మాత ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల పర్యవేక్షణలో 16 రోజులపాటు యజ్ఞం కొనసాగుతుంది.

22 రాష్ట్రాలకు చెందిన పండితులంతా ఇప్పటికే యజ్ఞభూమికి చేరుకున్నారు. 400 మంది బ్రాహ్మణోత్తముల సహకారంతో 1760 మంది పండితులు యజ్ఞాన్ని నిర్వహిస్తారు. శుక్రవారం సాయంత్రం మహా గణపతి పూజతో యజ్ఞానికి అంకురార్పణ జరుగుతుంది. అనంతరం పండితులకు దీక్షా వస్త్రాలను అందజేస్తారు.

మండప ప్రవేశంతో యజ్ఞానికి శ్రీకారం చుడతారు. దీన్ని పర్యవేక్షించేందుకు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి శుక్రవారం ఉదయం విశాఖ నుండి బయలుదేరి చండీఘడ్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా కురుక్షేత్ర వెళతారు. క్రతువు ముగిసే వరకు అక్కడే మకాం చేసి యజ్ఞాన్ని పర్యవేక్షిస్తారు. యజ్ఞ నిర్వహణలో నియమ నిష్టలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పండితులకు సూచించారు. సంప్రదాయ వస్త్రధారణ లేని వారిని యాగశాలలోనికి అనుమతించరాదని ఆదేశాలిచ్చారు

వైభవంగా కలశ యాత్ర
శ్రీ లక్ష చండీ మహా యజ్ఞానికి సన్నాహకంగా గురువారం మధ్యాహ్నం యజ్ఞభూమి నుండి వైభవోపేతంగా కలశ యాత్ర నిర్వహించారు. వందలాది మంది మహిళలు కలశాలను చేతపట్టి ప్రదర్శనలో పాల్గొన్నారు.

గుంతి శివారులో గంగ పూజ నిర్వహించారు. మానస సరోవరంతో పాటు సప్త నదుల నుండి తరలించిన జలాలను కలశ యాత్రలో ఊరేగించి యజ్ఞభూమికి తీసుకొచ్చారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, గుంతి మాత, జాగృతి జీతో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది మహిళా సాధువులు, రుషులు కలశ యాత్రలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking