లోకేష్ పాదయాత్రకు విశేష ఆదరణ
కాకినాడ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు.
కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేష్ పాదయాత్రకు గతంలో ఎన్నడు లేని విధంగా అంక్షలను విధించడం చాలా దారుణమన్నారు. అయినప్పటికి పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లబిస్తుందని, దీనిని చూసి వైకాపా నాయకులకు ఫ్యాంట్లు తడిచిపోతున్నాయని ఘాటుగా స్పందించారు