Logo

మార్క్ ఫెడ్ సంస్థ నిర్లక్ష్యం.. రైతులు ధర్నా

కొనుగోళ్లకోసం రైతులు ధర్నా

వరంగల్, మే 25 : మూడు రోజుల క్రితం కొనుగోలు చేసిన మక్క జొన్నలను లారీలు లేవనే సాకుతో మార్క్ ఫెడ్ సంస్థ నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ఆందోళన దిగారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కోట మైసమ్మ వద్ద రైతులు మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నలను తరలించాలని రాస్తారోకో చేశారు.

మూడు రోజుల క్రితం మార్క్ ఫెడ్ అధికారులు కల్లాల వద్ద మక్క జొన్నలు కొనుగోలు చేశారు మూడు రోజుల నుండి గోదాంకు తరలించేందుకు లారీలు లేవనే సాకుతో కల్లాల వద్దే ఉంచారు అసలే ఎప్పుడు వర్షం పడుతుందో తెలవని పరిస్థితి, దీంతో రైతులు తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్ లో వేసుకొని కోట మైసమ్మ వద్ద ఉన్న గోదాం తీసుకొచ్చారు అయినా అన్లోడ్ చేసేందుకు సిబ్బంది లేరని మార్క్ఫెడ్ అధికారుల సాకుతో రైతులు రోడ్ ఎక్కారు.

రైతుల రాష్ట్ర రోకో నర్సంపేట ప్రధాన రోడ్డుపై సుమారు నాలుగు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామైంది. చివరకు మార్కెట్ అధికారులు తక్షణమే అన్లోడ్ చేసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమింప చేశారు. మార్క్ఫెడ్ అధికారుల నిర్ణయంతో ప్రతి రైతు ఒక్క ట్రాక్టర్ కి 5 నుండి 6000 రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందని, మూడు రోజుల నుండి తిండి తిప్పలు లేక గోదాముల వద్ద వేచి ఉంటున్నామని, ఆందోళన చేస్తే తప్ప అధికారులు దిగి రాలేదని మాజీ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రైతు దేవేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking