Logo

మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది

కేటీఆర్..  బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి. ఇవే గాకుండా ముఖ్యమంత్రి కేనీఆర్ తనయుడు హోదా..

నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తున్న కేటీఆర్ పర్యాటనలో నిరసనలు తెలుపకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు రాత్రి నుంచి అలుపెరుగకుండా కష్ట పడుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, ప్రజాపంథా, న్యూడెమోక్రసీ కార్యకర్తలను ముందు జాగ్రత్తగా అరెస్టులు చేశారు. గతంలో సీఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసు బాస్ టౌన్ సీఐని వెకెన్సీ రిజర్వేషన్ కు బదిలీ చేశారు.

అయినా.. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎన్ఎస్ఎయుఐ నాయకులు అడ్డుకునేందుకు యత్నం చేశారు.

నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఎదురుగా వచ్చి కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరెస్ట్ చేసి సానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ముందుగా కేటీఆర్ కలెక్టర్ సమీకృత సముదాయాల వద్ద హెలిప్యాడ్ లో ల్యాండ్ అయి అక్కడి నుండి బైపాస్ మీదుగా బోర్గం లోని భుమరెడ్డి కన్వెన్షన్ హాలు కు రోడ్డు మార్గం గుండా బయలుదేరగా కంటేశ్వర్ బైపాస్ వద్ద కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking