రాజా సింగ్ కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు ప్రమాదం తృటిలో తప్పింది. అయన ప్రయానిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ రోడ్డు మద్యలో ఊడిపోయింది.
కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. శుక్రవారం అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా.. దూల్ పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఘటన జరిగింది.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని రాజాసింగ్ గత కొంతకాలంగా ప్రభుత్వానికి మెర పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని రాజసింగ్ ఆవేదన వ్యక్తం చేసారు. తన వాహనాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు.