Logo

ఒక్క హామీ నెరవేర్చలేదు: బీజేపీ ఎమ్మెల్యే

ఒక్క హామీ నెరవేర్చలేదు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

హైదరాబాద్ : శాసనసభలో బీజేపీ సభ్యుడు రఘునందన్ రావు మాట్లాడారు. అధికారంలో ఉన్నామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసారు.. తనను గెలిపించారన్న అక్కసుతో కేసీఆర్ దుబ్బాకకు డిగ్రీ ఇవ్వలేదని, రింగ్ రోడ్డు కూడా మంజూరు చేయలేని ఆరోపించారు. స్పెషల్ డెవలెప్మెంట్ స్కీం కింద గజ్వేల్ కు రూ.890 కోట్లు, సిద్ధిపేటకు రూ.790కోట్ల నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్.. దుబ్బాక నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ఏ హమీలు కుడా అమలుకు నోచుకోలేదని అన్నారు. పర్పంచులకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వారు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. ప్రగతి భవన్ ముందు ఓ సర్పంచ్ కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నరేండ్లు అయితున్నా ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని రఘునందన్ ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking