Logo

పాత బస్తీని పట్టించుకోవడం లేదు : ఓవైసీ

ఓవైసీ, కేటీఆర్ ల వాగ్వాదం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో శనివారం గవర్నర్ ప్రసంగంపై చర్చ కొనసాగింది. ఎంఎంఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వం పాత బస్తీని పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు.. దీనిపై మంత్రి కెటిఆర్ అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అయన మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు.

అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులు జరుగుతున్నాయని ఇంత తక్కువ రోజులు బడ్జెట్ సమావేశాలు జరగడం చరిత్రలోనే మొదటిసారని గుర్తు చేశారు. కలవాలంటే మంత్రులు కూడా అసలు అందుబాటులో ఉండరని ఆరోపించారు.

అందుకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదని అన్నారు. ఓవైసీ మంత్రి కామెంట్లను సీరియస్ గా తీసుకుంటున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ అంశంపై పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో చర్చిస్తామని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఒవైసీ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఏడుగురుతో కాకుండా కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెడతామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking