Logo

ఓబీసీల కుల జనగణన డిమాండ్ ను..

ఓబీసీల కుల జనగణన డిమాండ్ ను

ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తా

: బిసి నేతలకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ ఆధావాలే

న్యూఢిల్లీ : దేశంలో ఓబిసి వర్గాల ఆకాంక్ష అయిన ఓబీసీ కుల జనగణన డిమాండ్ ను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి రాందాస్ ఆదావాలే హామీ ఇచ్చారు. శుక్రవారం ఏపీ భవన్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ ఇంచార్జ్ కర్రీ వేణుమాధవ్ అధ్యక్షతన జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీ రాందాస్ అధావాలే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి ఓబిసి బిసి వర్గాలు ప్రజలు కోరుకుంటున్నా పలు న్యాయ సమ్మతమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే భావజాలంతో ఆర్పీఐ పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా పని చేస్తున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీ లు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తనకు తెలుసునని చట్టసభల్లో ఓబిసి రిజర్వేషన్లు కల్పన తాను కృషి చేస్తానని అధావాలే పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు అవకాశం కల్పించిందని దాన్ని సద్వినియోగం చేసేలా బీసీ సంఘాలు కృషి చేయాలన్నారు. దేశంలో చేతివృత్తులు ఓబీసీలకు చెందినటువంటి కుల వృత్తుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిచ్చేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘాల దక్షిణాది రాష్ట్రాలు ప్రతినిధులు బీసీ జనగణన చేయాలని పెద్ద ఎత్తున నినదించటంతో ఆయన భావోద్వేగానికి గురై జనగణన అంశం తాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేంద్రంతో పోరాడతానని అదావాలే హామీ ఇచ్చారు.

సభాధ్యక్షులు కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ, సావిత్రిబాయి పూలే మహిళా సంఘం అధ్యక్షురాలు బెల్లం మాధవి ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ యవజన సంఘం అధ్యక్షుడు పిల్ల నివాస్, కే యుగంధర్, ఎం జ్యోతి, అడ్వకేట్ ముద్దాడ భవాని, గణేష్ జేటి ,మల్లికార్జునరావు, కాకుమాను నరేంద్ర బాబు, N. అశోక్ కుమార్, దాసు, వి నాని, బి అజయ్ యాదవ్, శరత్ సాయి ,పిల్ల దినేష్ కృష్ణ, విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం వెంకన్న గౌడ్,అన్గిరేకుల వర ప్రసాద్, గుజ్జ కృష్ణ , రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి జిల్లా అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ బీసీ సంక్షేమ సంఘం నేతలు తదితరులు ప్రసంగించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking