Logo

వృద్ధాప్యం మరో బాల్యం

నిశితంగా గమనిస్తే

వృద్ధాప్యం మరో బాల్యం..

నిశితంగా గమనిస్తే – వృద్ధాప్యం మరో బాల్యం. చిన్న పిల్లలు తాము అడిగింది ఇవ్వకపోతే తల్లిదండ్రుల మీద అలుగుతారు. చేతిలో ఉన్న వస్తువులను విసిరేస్తారు. మూతి ముడుచుకుని మూలన కూర్చుంటారు, ఏడుస్తారు. చివరకు అనుకున్నది సాధిస్తారు.

వృద్దులు అంతే. కొడుకో, కోడలో తమ మాట వినక ఎదిరిస్తే తట్టుకోలేరు. అలుగుతారూ, సనుగుతారు, కోపగిస్తారు, తిట్టుతారు.. పిల్లలు దిగివచ్చేదాకా కొంతమంది పెద్దలు తమ పంతం వీడరు.

వృద్దాప్యంలో బాల్య చేష్టలు పునరావృతమవుతాయి. తప్పటడుగులు, బోసినవ్వులు, మాటల్లో తడబాటు, నిద్రలో ఉలికిపాటు, అతినిద్ర… వృద్దులు సర్వసాధారణ లక్షణాలు.

తల్లి పిల్లలను లాలించినట్లు కొడుకులు వృద్ధులైన తల్లిదండ్రులను బుజ్జగించాలి. వారి చిన్న, చిన్న కోరికలు తీర్చడానికి సమయం కేటాయించాలి. రోజులో కొద్దిసేపు వారితో ముచ్చటించాలి. పెద్దలు చెప్పే అనుభవాల సారాన్ని గ్రహించాలి.

అమ్మమ్మ ఆప్యాయత, అనురాగాలతో..

నోట్: బ్రతికినప్పుడు తల్లిదండ్రుల యోగ క్షేమం గురించి పట్టించుకోని కొడుకులు.. కూతుళ్లు మరణించిన తరువాత…)

శేరు పోశెట్టి, ఆర్మూర్

Leave A Reply

Your email address will not be published.

Breaking