28 లోపు పెన్షనర్లు ఈ కేవైసీ సమర్పించాలి
అమరవతి : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్లు ఈ కేవైసీని ఈనెల 28వ తేదీ లోపు సంబంధిత ఎస్ టి ఓ కార్యాలయాలయందు సమర్పించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కారుమూరి రాజేంద్రప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ఎస్ టి ఓ కార్యాలయాలలో వేలిముద్రలు పడని వారికి ఐరిస్ ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఈ కేవైసీ నమోదు చేసుకుంటామని బందరు మచిలీపట్నం సబ్ ట్రెజరీ ఆఫీసర్లు తెలిపారన్నారు