గుర్రపు స్వారీ స్థావరం పై పోలీసుల దాడులు
13 గురిని అరెస్టు చేసిన పోలీసులు
రంగారెడ్డి : రాజేంద్రనగర్ గుర్రపు స్వారీ స్థావరం పై పోలీసుల దాడులు. తేజస్వీ నగర్ కాలనీ లోని ఓ ఇంటి పై దాడి చేసిన పోలీసుల బృందం. ఆన్ లైన్ లో గుర్రపు స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తుండగా 13 మందిని రెడ్ హాండెడ్ గా పట్టుకున్న పోలీసులు. వారి వద్ద నుండి 51 వేల నగదు, 17 మొబైల్ ఫోన్లు, 19 Debit cards, credit cards, horse racing guide book తో పాటు ఓ కారు ను సీజ్ చేసిన కాప్స్.
విశ్వసనీయ సమాచారం మేరకు తేజస్వీ కాలనీ లోని ఓ అపార్ట్‌మెంట్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం తో దాడులు చేసిన కాప్స్. పోలీసులను చూసి పారిపోయే యత్నం చేసిన కేటుగాళ్లు. 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వాట్స్ ఆప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో గుర్రపు స్వారీ సమాచారం పోస్టు చేస్తున్న నిర్వాహకుడు ద్వారా తిరుమల్ రెడ్డి. RS world అనే గ్రూప్ ద్వారా గుర్రపు స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తున్న తిరుమల్ రెడ్డి. 13 మంది పై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పట్టుబడ్డ వారు అందరూ బాడా వ్యాపారస్తులు గా గుర్తింపు.