బీర్ బాటిల్ లో ఐఐడి తో మందుపాతరలతో
పోలీసులను హంతం చేయాలని
మావోయిస్టుల వ్యూహం భగ్నం
ములుగు జిల్లా : అడవిలోకి కూంబింగ్ వెళ్లే పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు కొత్తరహా మందుపాతరలు పేల్చడానికి సిద్దమయ్యారు. వెంకటాపురం పామునూర్ అడవిలో బీర్ బాటిల్ లో ఐఐడి తో మందుపాతరలు పేల్చడానికి పన్నిన నక్సల్స్ వ్యహంను పోలీసులు భగ్నం చేశారు.
బీరు బాటిల్ ను మందుపాతరగా మార్చారు నక్సల్స్. నక్సల్స్ వ్యూహం పోలీసులను విస్మయ పర్చింది. అనుమానం రాకుండా పోలీసులే లక్ష్యంగా మందుపాత్ర అమర్చిన మావోయిస్టులు.
చతిస్గడ్ అటవీ ప్రాంతం నుండి మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ గ్రామాలలో పర్యటించారని సమాచారంతో స్పెషల్ పార్టీ, సిఆర్పిఎఫ్ బెటాలియన్ పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. సకాలంలో మందుపాత్ర గుర్తించి నిర్వీర్యం చేయడంతో పోలీసులకు పెద్ద ప్రమాదం ముప్పు తప్పింది. కరెంట్ వైర్, బీర్ బాటిల్, బోల్ట్ లు, కాపర్ సీల్, గన్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఈ సంఘటనకు సంబందించి మావోయిస్టు అగ్రనేతలు చంద్రన్న, దామోదర్, కనకాల రాజిరెడ్డి, మంగు, సుధాకర్ లపై వెంకటాపురం పోలీస్ స్టేషన్ తో కేసు నమోదు చేశారమన్నారు ఏటైరు నాగారం ఎఎస్ పి సిరిశెట్టి సంకీర్త్, .