గల్ఫ్ జె.ఏ.సి.ఛైర్మెన్ గుగ్గిళ్ల రవి గౌడ్ అరెస్ట్
వేములవాడ : గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం నిరాంతరం పోరాడుతున్న గల్ఫ్ జె.ఏ.సి.ఛైర్మన్ గుగ్గిళ్ళ రవిగౌడ్ వేములవాడ లో ఎం.ఎల్.ఏ.చెన్నమనేని రమేష్ బాబు గెస్ట్ హౌస్ దగ్గర అరెస్ట్ చేశారు పోలీసులు.
వేములవాడ నియోజక వర్గంలోని కథలాపూర్ మండలంలోని గంబీర్పూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు ఆరోగ్య పరిస్థితులు బాగాలేక అనారోగ్యంతో చనిపోయారు. గల్ఫ్ జె.ఏ.సి నాయకులు గుండెల్లి నర్సింలు పేపర్ వర్క్ పూర్తి చేసి ఈరోజు మృతదేహాన్ని ఇండియాకు పంపినారు.
అట్టి మృతదేహాన్ని గల్ఫ్ జె.ఏ.సి.ఛైర్మెన్ గుగ్గిళ్ల రవి గౌడ్ తో పాటు ఇతర నాయకుల కలిసి స్థానిక ఎం.ఎల్.ఏ రమేష్ బాబు గెస్ట్ హౌజ్ దగ్గర పెట్టి నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే గెస్ట్ హౌజ్ గేటు ముందు పెట్టి నిరసన తెలుపుతున్న క్రమంలో గుగ్గిళ్ళ రవిని పోలీసులు అరెస్ట్ చేసి వేములవాడ DSP ఆఫీస్ కు తరలించినారు.
బేషరతుగా విడుదల చేయాలి
అక్రమంగా అరెస్ట్ చేసిన గల్ఫ్ జె.ఏ.సి.ఛైర్మన్ మరియు నాయకులను వెంటనే భేషరతు గా విడుదల చేయాలని గల్ఫ్ జె.ఏ.సి. తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. లేని యెడల రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ ప్రభుత్వాన్ని గల్ఫ్ కార్మికులు హెచ్చరించారు.