డబల్ మర్డర్ కేసులో నిందితులు పట్టుకుంటే బహుమతి
విజయవాడ : డబల్ మర్డర్ కేసులో న్న ఇద్దరు నిందితుల ఆచూకీ తెలిపిన వారికి ఆర్థికపరమైన ప్రోత్సాహం అందించడం జరుగుతుందని కృష్ణ జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ఈ ఇద్దరిని నిందితుల ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.
ముసునూరు మండలం కాట్రేనిపాడు దళితవాడలో ఇటీవల తల్లి కూతుళ్ళ హత్య కేసులో ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానితులుగా పోలీసులు విచారణలో తేలింది. పై ఫోటోలో ఉన్న వ్యక్తులు ఏపీ జీరో 7 డివై 9081 నెంబర్ గల నలుపు రంగు స్కూటీపై తిరుగుతున్నట్లుగా పోలీసులు తెలిపారు.
మాస్ట్రో హెడ్జ్ e కంపెనీకి చెందిన స్కూటీ గా పోలీసులు తెలిపారు. ఫోటోలో ఉన్న వ్యక్తుల పేర్లు దేవరపల్లి రవీంద్ర అలియాస్ రవి, మరో వ్యక్తి మంగి చందు అలియాస్ భువనేశ్వర్ రావు అనే వ్యక్తులుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.
ఆచూకీ తెలపవలసిన మొబైల్ నెంబర్లు 83329883803,9440797441 కు కాల్ చేసి సమాచారం అందించవలసిందిగా ముసునూరు ఎస్సై ఎం.కుటుంబరావు తెలిపారు.