Logo

ఆర్టీసీ ఎండి ట్విట్టర్ ఖాత హ్యకింగ్

హ్యకింగ్ (కంప్రామైజ్డ్).. ఇప్పుడు ఆర్టీసీ సంస్థ హ్యకింగ్ సమస్యను ఎదుర్కొంటుంది. టీఎస్ ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్ అధికారిక ట్విట్టర్ ను హ్యకింగ్ చేశారు. 22 జనవరి 2023 నాడు హ్యకింగ్ అయినట్లు తెలుస్తోంది. ట్వీట్టర్ సహాయంతో హ్యకింగ్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు. 
ఈ హ్యకింగ్ (కంప్రమైజ్డ్) సమస్య పొలిటికల్.. పోలీసు అధికారులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఐపిఎస్ ఆఫీసర్ కు రాజీనామా చేసి పొలిటికల్ బాట పట్టిన బహుజన సమాజ్ పార్టీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సెల్ ఫోన్ హ్యకింగ్ అవుతున్నట్లు ట్విట్టర్ స్వయంగా ప్రవీణ్ కుమార్ కు మెస్సెజ్ పెట్టి అలార్టు చేయడం విధితమే.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ హ్యకింగ్ (కంప్రమైజ్డ్) కావడం వెనుక ఏముంటుంనే సందేహం వ్యక్తం అవుతుంది. రహస్యంగా జరిగే కార్యక్రమాలను తెలుసుకోవడానికి అనుమతి తీసుకుని పోలీసు వ్యవస్థ హ్యకింగ్ చేసి మాటలు వింటుంది.
అయితే.. బహుజన సమాజ్ పార్టీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బహుజనుల రాజ్యం కోసం పాదయాత్ర చేస్తూ ప్రజల వద్దకు వెళుతున్నారు. రాబోయే కాలంలో బీఎస్పీతో పొలిటికల్ గా తమకు దెబ్బగా భావించి ప్రభుత్వమే ఈ హ్యకింగ్ చేయిస్తోందనేది ప్రతి పక్షలు ఆరోపణ.
అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హ్యకింగ్ (కంప్రమైజ్డ్) సమస్యను అధిగమించడానికి బీజేపీ ముఖ్యనేతలు ఐఫోన్ లు మాత్రమే వాడాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. సీఎం సీటు (గద్దె) కోసం అధికార పార్టీ హ్యకింగ్ చేస్తుందని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

On 22.01.2023 at 21:30hrs official Twitter account of TSRTC MD (@tsrtcmdoffice) was compromised. This unfortunate incident happened despite all safety measures. We do not endorse any tweets from our handle. We are working with Twitter Support to resolve the issue.

PRO, TSRTC

 

Leave A Reply

Your email address will not be published.

Breaking