Logo

కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా :  పెండింగ్ బిల్లులు రావడం లేదని మనోవేదనకు గురై కలెక్టర్ కార్యాలయం ఎదుట సర్పంచ్ ఆమె, భర్త వార్డ్ మెంబర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నందిపేటకు చెందిన సర్పంచ్ సాంబార్ వాణి, భర్త తిరుపతి వార్డ్ మెంబర్ న్యాయం కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.

రెండు కోట్లతో గ్రామంలో అభిరుద్ది కార్యక్రమాలు చేాసామని బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించాడు. ఉప సర్పంచ్ చెక్కులపై సంతకం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. బిజెపి నుంచి ఎన్నికైన తాను అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో టిఆర్ఎస్ లో చేరానని, అయినా నాపై వేధింపులు మనుకొలేదన్నరు.

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం తనను వేధిస్తూ ఇబ్బంది పలు చేస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చెట్టు తిరిగిన న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking