Logo

షర్మిల బహిరంగ క్షమాపణ చెప్పాలి : హిజ్రాలు

షర్మిల బహిరంగ క్షమాపణ చెప్పాలని

హిజ్రాల అందోళన

మహబూబ్ నగర్ / హైదరాబాద్ : వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ను కొజ్జా అని తిట్టడంతో మహబూబ్ నగర్, హైదరాబాద్ల  లలో హిజ్రాలు ఆందోళనకు దిగారు.

వైఎస్‌ షర్మిల ఫ్లెక్సీ ని చెప్పులతో కొట్టి తగలబెట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యాలకు వెంటనే షర్మిల క్షమాపణ చెప్పాలని హిజ్రాలు డిమాండ్ చేశారు. ఇతరులను తమతో పోల్చుతూ తమని తక్కువగా పరిగణించిన వైఎస్‌ షర్మిల పై హిజ్రాలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆమెను తీవ్రంగా దూషిస్తూ చెప్పులతో ఫ్లెక్సీ ని కొడుతూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. వైఎస్‌ షర్మిల కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హిజ్రాలు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking