Logo

పల్నాడులో మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు

పల్నాడులో కాల్పుల కలకలం..
మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డికి తీవ్రగాయాలు

పల్నాడు: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో రొంపిచర్ల మండలంలో కాల్పులు కలకలం సృష్టించాయి. రొంపిచర్ల మండలం అలవాలలో మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు.

దీంతో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని కుటుంబసభ్యులు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను మరో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రత్యర్థులే బాలకోటిరెడ్డిపై కాల్పులకు తెగబడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking