Logo

పౌర విమానయాన రంగం అభివృద్ధికి విశేష కృషి

పర్యాటక రంగ అభివృద్ధిలో విమానయాన శాఖ పాత్ర కీలకం

– దేశంలో పౌర విమానయాన రంగం అభివృద్ధికి విశేష కృషి జరుగుతోంది
– ఈ రెండు రంగాలు ఒకదానికొకటి పూరకాలు (కంపెన్సేషన్)
– ఉడాన్ స్కీమ్ కు కేంద్రం రూ. 2,360 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్
– దేశీయ డ్రోన్ తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందకు డ్రోన్ పాలసీ తీసుకొచ్చింది.

: కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ : ప్రపంచంలో ఎక్కడైనా టూరిజం పెరగడానికి విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విమానయాన రంగంలో భారత్ సాధించిన అభివృద్ధి, తీసుకున్న కీలక నిర్ణయాలను కిషన్ రెడ్డి వివరించారు. ఏవియేషన్ సెక్టార్ టూరిజం, అలాగే సంస్కృతి పరస్పర మార్పిడికి వెన్నెముక లాంటిందన్నారు. ఈ విషయంలో గత ఎనిమిదన్నర ఏళ్లలో పౌర విమానయాన శాఖ ఎంతో అభివృద్ధిని సాధించింది. ప్రపంచంలోనే భారత్ మూడో అతి పెద్ద డొమెస్టిక్ విమానయాన రంగాన్ని కలిగి ఉందన్నారు.

కరోనా ముందు భారత సివిల్ ఏవియేషన్ సెక్టార్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంగా ఉందని.. 2014 మేలో డొమెస్టిక్ ప్రయాణికుల సంఖ్య 6 కోట్లు ఉండగా.. 2020 వరకు ఆ సంఖ్య 14.3 కోట్లకు పెరిగిందన్నారు కిషన్ రెడ్డి.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా కరోనానంతరం విమానయాన రంగంలో సానుకూల మార్పులు కనబడుతున్నాయని.. ఈ ఏడాది విమాన ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పౌర విమానయాన రంగానికి కేంద్ర అనేక చర్యలు తీసుకుంటోంది. 2014కు ముందు భారత్ లో 400 విమానాలు ఉండేవి. 2022 చూస్తే వీటి సంఖ్య 750కు పెరిగింది. గతంలో 74 విమానాశ్రయాలు పనిచేసేవి.. వాటి సంఖ్యకు 147 కు పెంచామని ఆయన వెల్లడించారు. 2025లోపు 220 విమానశ్రయాలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు కిషన్ రెడ్డి.

2014 తర్వాత కొత్తగా 6 అంతర్జాతీయ విమానాశ్రయాలు అందుబాటులోకి తీసుకొచ్చామన్న కిషన్ రెడ్డి.. 2014 కంటే ముందు భారత్ లో 3 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 21కు పెరిగిందని వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా అప్పర్ ఎయిర్ స్పేస్ ను వాణిజ్య వినియోగం కోసం కేటాయించేందుకు.. 119 మార్గాలకు సంబంధించి డిఫెన్స్ నుంచి అనుమతి లభించిందని ఆయన తెలిపారు. దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీని ద్వారా విమానయాన సంస్థలకు ఏడాదికి వెయ్యి కోట్లు ఆదా అవుతుందన్నారు.

సామాన్య మానవులు కూడా విమాన ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో మోదీ గారు ప్రవేశపెట్టిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమ్ కోసం రూ.2,360 కోట్ల నిధులను కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గా అందించిందన్నారు. 1000 మార్గాల్లో టూరిజం అభివృద్ధి కోణంతోపాటు చిన్న చిన్న పట్టణాలను కలిపేందుకు ప్లానింగ్ చేయగా.. ప్రస్తుతానికి ఈ సంఖ్య 470 రూట్లలో విమానాలు నడుస్తున్నాయన్నారు. ఉడాన్ స్కీమ్ ద్వారా టూరిజం శాఖ నుంచి నిధులు అందిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

2016 లో 29 విమాన శిక్షణ సంస్థలు (FTOs) ఉండేవని, 31 మార్చి 2022 కి ఈ సంఖ్య 34కు పెరిగిందన్నారు. డిసెంబర్ లోపు 49 విమాన శిక్షణ సంస్థలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత ప్రభుత్వం డ్రోన్ సెక్టర్ లోనూ సంస్కరణలు చేపట్టిందన్న కిషన్ రెడ్డి.. డ్రోన్ ఫాలసీ ద్వారా దిగుమతులపై నిషేధం విధించి దేశీయంగా డ్రోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా దేశీయ ఉత్పత్తులు పెరుగుతాయి.

కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు వందే భారత్ మిషన్ చేపట్టారు. ఆపరేషన్ రాహత్ ద్వారా యెమెన్ లో యుద్ధం సమయంలో 4 వేల 600 మంది నర్సులను స్వదేశానికి తీసుకురావడం, ఆపరేషన్ గంగ పేరుతో కేంద్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత మెడికల్ స్టూడెంట్స్ ను తీసుకువచ్చినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. కరోనా సమయంలోనూ పీపీఈ కిట్లు, మాస్కుల నుంచి అత్యవసర మందుల వరకు గమ్యస్థానాలకు చేర్చడంలో భారత విమానయాన రంగం పోషించిన పాత్ర గురించి కిషన్ రెడ్డి వివరించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking