Logo

సుభాన్, తమ్మీ నీకు నేనున్నా.. : ఎంపీ రంజిత్ రెడ్డి

సుభాన్, తమ్మీ నీకు నేనున్నా…

కార్యకర్తకు భరోసా ఇచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి

వికారాబాద్, మే 21 :  పొలిటికల్ అంటెనే యూజ్ త్రూ.. నాయకుడిగా ఎదుగాలంటే కార్యకర్త శ్రమ ఎంతో.. కానీ.. పదవీ రాగానే కార్యకర్తలను పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఎందరో.. కానీ.. చేవెళ్ల ఎంపీ డాక్టర్. జి. రంజిత్ రెడ్డి మాత్రం మానవత్వంతో ఆలోచన చేస్తాడు.

రాజకీయంగా ఎదుగడానికి కార్యకర్తగా పని చేసిన సుభాష్ ఎక్సిడెంట్ అయి ఆసుపత్రిలో ఉంటే తానే స్వయంగా వెళ్లి ‘‘ సుభాన్ తమ్మీ నీకు నేనున్నా ఆసుపత్రి ఖర్చులు నేనే భరిస్తాను అంటూ ఇచ్చిన హామి ఆ కుటుంభానికి ఎంతో ఊరట ఇచ్చింది.

ఇటీవల వికారాబాద్ లో యాక్సిడెంట్ కు గురై, సికింద్రబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికారాబాద్ మున్సిపాలిటీ యువ నాయకులు సుభాన్ రెడ్డిని ఆదివారం చేవెళ్ల ఎంపీ. డాక్టర్. జి. రంజిత్ రెడ్డి పరామర్శించారు.

అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వైద్యుల ద్వారా అతనికి అందుతున్న చికిత్స పై ఆరా తీశారు. అతని కుటుంబ సభ్యులను కలిసి, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సుభాన్ వైద్య ఖర్చులకయ్యే 8 లక్షల రూపాయల మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఆపద వచ్చిందని కార్యకర్తలేవరూ అదైర్య పడొద్దని, తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking