Logo

బట్టి విక్రమార్క మాటలు వెనక్కి తీసుకో.. మెపా

బట్టి విక్రమార్క మాటలు వట్టి మాటలే
_మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
: MEPA రాష్ట్ర కమిటీ

వరంగల్ : చేపలు పట్టడం ముదిరాజ్ కులస్తులు జీవన ఆధారం అని ,అలాంటి వృత్తి లోకి ఇతర కులాను చేర్చాలని బట్టి గారు నిండు శాసనసభ లో అనడం సబబు కాదని ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని హనుమకొండ లోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెపా రాష్ట్ర కమిటీ సమావేశంలో MEPA మెపా ( ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) రాష్ట్ర అధ్యక్షులు కొట్టగట్టు శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.

కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క మాటలు వట్టి మాటలుగా కొట్టిపడేశారు. ముదిరాజ్ సామాజిక వర్గాల్లో మెజారిటీ ప్రజలు చేపలు పట్టుకొని కుటుంబాలను పోషిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ లో మెజారిటీ శాతం ఉన్న ముదిరాజ్ లు (తమను) బీసీ డి నుండి బీసీ ఏ లోకి మార్చాలని పోరాడుతున్న క్రమం లో బట్టి గారు బీసీ లోనీ ఇతర కులాలను చేపల వృత్తి లోకి చేర్చాలని అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అలా చేస్తే మెపా ఆధ్వర్యంలో పల్లె నుంచి పట్టణంలో వరకు మేధావులు, విద్యావంతుల సహకారం తో ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుండ్ర చంద్రశేఖర్, డా.కట్ల శ్రీనివాస్, రెగుల మొగిలి,అల్లం వేణుమాధవ్, పెండెం మధు, బుర్రి సంపత్,శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking